Dec 07, 2025, 15:12 IST/
హైదరాబాద్లోని రోడ్లకు రతన్ టాటా, ట్రంప్ పేర్లు
Dec 07, 2025, 15:12 IST
TG: రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు, US కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయనున్నారు. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ల పేర్లతో మరికొన్ని రహదారులకు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రంతో పాటు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయనుంది.