చంద్రగిరి మండలం - Chandragiri Mandal

జగిత్యాల జిల్లా
రేపు తేలనున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం
Mar 10, 2026, 17:03 IST/

రేపు తేలనున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం

Mar 10, 2026, 17:03 IST
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల భవితవ్యం బుధవారం ఉదయం 10 గంటలకు తేలిపోనుంది. వీరిద్దరిపై నమోదైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించనున్నారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు.