వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం తెల్లవారుజామున శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ ను స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.