చంద్రగిరి: ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

2285చూసినవారు
చంద్రగిరి: ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
తిరుపతి రూరల్ మండలంలోని గేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలో గురువారం ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ, టీనేజ్ వయస్సులో ఆకర్షణలను నియంత్రించకపోతే జీవితంలో నష్టాలు ఎదురవుతాయని విద్యార్థులను హెచ్చరించారు. ఫోక్సో చట్టం ప్రాముఖ్యత, నిబంధనలపై అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్