చంద్రగిరి: చంద్రబాబు రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు

2చూసినవారు
చంద్రగిరి: చంద్రబాబు రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు
వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా ప్రధాన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్