చంద్రగిరి: చిన్నగొట్టిగల్లు పీఏసీలో రూ. 2. 37స్కాం ఆరోపణలు

5చూసినవారు
చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ. 2.37 కోట్ల భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు టీడీపీ నేత మురళీ సోమవారం ఆరోపించారు. సంఘం మాజీ ఛైర్మన్ సహదేవ రెడ్డి ఆధ్వర్యంలో వన్‌ గ్రాము గోల్డ్ పథకం కింద రూ. 72 లక్షలు, స్వల్ప–దీర్ఘకాల రుణాల కింద రూ. 1.63 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కేసులో సెక్రటరీ జగదీష్, అప్రైజర్ రాజా సురేష్ ఇప్పటికే అరెస్టయ్యారని, రైతుల సొమ్ముతో సహదేవ రెడ్డి విలాసవంతమైన జీవితం గడిపారని మురళీ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్