వైకుంఠ ఏకాదశి పర్వదినాన తుమ్మలగుంట శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ద్వాదశి రోజున కూడా భక్తుల తాకిడి తగ్గలేదు. ఆలయం వెలుపల క్యూలైన్లలో నిలబడిన భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిబ్బందికి సూచించారు. ద్వాదశి రోజున స్వామివారికి నివేదించే దైనందిన పూజా కార్యక్రమాలను యథావిధిగా పూర్తి చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి భక్తులకు కనువిందు కలిగించారు.