చిన్నగొట్టిగల్లు మండలం ఎగవూరులో ప్రభుత్వ భూమిని నాగిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి ముళ్లకంచె ఏర్పాటు చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో సమీప రైతుల పొలాలకు వెళ్లే దారి మూసుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దారి లేకపోవడంతో పంటలు కోయలేక పొలాల్లోనే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంఆర్ఓ భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదని, దీంతో ఆక్రమణదారు మరింత ధైర్యంగా వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.