చంద్రగిరి: ఛాయాపురంలో మహామండలేశ్వరస్వామి ఆలయానికి శంకుస్థాపన

2చూసినవారు
రామచంద్రాపురంలోని ఛాయాపురంలో శ్రీమహామండలేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం పీఠాధిపతులు కమలానంద సరస్వతి, పిఠాపురం ఆస్థాన పండితులు సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేద మంత్రాల మధ్య ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్థానికులు ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్