తిరుచానూరులో శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు అనంతరం సాయంత్రం శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ పరిసరాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగాయి.