చంద్రగిరి మండలం మూలపల్లి చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో హిటాచీ యంత్రాలతో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారు తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడంతో పాటు గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, గనుల శాఖ అధికారులను కోరుతున్నారు.