పాకాల మండలం దామలచెరువు మార్కెట్‌లో కీలు కాయలకు డిమాండ్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో టన్నుకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ ధరకు కూడా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో రైతులు, వ్యాపారులు కీలు కాయలను రోడ్డు పక్కన డంపింగ్ చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో సరైన ధరలు లేకపోవడం, కొనుగోలుదారుల కొరత ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు.