తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ సర్వే నం. 484లో ఉన్న ప్రభుత్వ కాలువ భూమిని ఓటేరుకి చెందిన వ్యక్తి అక్రమంగా కబ్జా చేశాడు. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రజలు సంబంధిత రెవెన్యూ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.