తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. తమిళనాడుకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రెండు వాహనాల్లో దాచిన 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 27 లక్షలుగా అంచనా వేశారు. పరారైన స్మగ్లర్ల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.