చంద్రగిరి: శంఖంపల్లెలో దొంగతనం కలకలం

4చూసినవారు
చంద్రగిరి: శంఖంపల్లెలో దొంగతనం కలకలం
తిరుపతి జిల్లా పాకాల మండలం శంఖంపల్లెలో గురువారం దొంగతనం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన వసంతమ్మ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి చొరబడి సుమారు 80 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. ఇంటికి తిరిగి వచ్చిన వసంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :