చంద్రగిరి: నాగపట్ల చెరువులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

11చూసినవారు
చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని నాగపట్ల చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోతోందని, పగలు నిశ్శబ్దంగా ఉండి, చీకటి పడగానే పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సహజ వనరులను బహిరంగంగా దోచుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకుని, అక్రమ మట్టి రవాణాను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు శాఖలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్