చంద్రగిరి: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

3చూసినవారు
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో సూర్య కిరణాల వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్