తిరుచానూరులో శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చిపై ఊరేగి భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించి, సాయంత్రం అమ్మవారిని పట్టువస్త్రాలు, పుష్పాలతో అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు.