చంద్రగిరి: బైక్ తో అడవి పందిని ఢీకొట్టిన యువకులు

57చూసినవారు
చంద్రగిరి: బైక్ తో అడవి పందిని ఢీకొట్టిన యువకులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాళెం మండలం చిట్టేచర్ల సమీపంలో ఆదివారం రాత్రి బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న అడవి పందిని ఢీకొట్టారు. ఈ ఘటనలో పంది మృతి చెందగా, యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు పందిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని నైరబైలుకు చెందిన యువకులు తరుణ్, తేజగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్