తిరుపతి దగ్గర దామినేడులో విషాదం వెలుగుచూసింది. ఒక ఇంట్లో కుళ్లిపోయిన మూడు మృతదేహాలు బయటపడడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. మరణించిన వారు తమిళనాడుకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. వారం క్రితమే ముగ్గురూ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానం. ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు.