తిరుపతిలో 800 ఉద్యోగాలకు భారీ జాబ్ మేళా

0చూసినవారు
తిరుపతిలో 800 ఉద్యోగాలకు భారీ జాబ్ మేళా
తిరుపతిలోని ఎస్‌వీసీసీ డిగ్రీ కళాశాలలో మే 29న AP Skill Development Corporation ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. SRAHP Group మేనేజింగ్ డైరెక్టర్ డా. ఆర్. శ్రవణ్ కుమార్ ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో SRAHP Groupతో పాటు 17కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి. దాదాపు 800 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొని ఉద్యోగాలు పొందవచ్చు.