చంద్రగిరి పట్టణంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఐ సురేష్ నేతృత్వంలో పోలీసులు, విద్యార్థులు నాగాలమ్మ ఆలయం కూడలి నుంచి టవర్ క్లాక్ వరకు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం దేశ సేవ అని, అమరవీరుల త్యాగం వల్లే సమాజం సురక్షితంగా ఉందని, వారి కుటుంబాల త్యాగం కూడా చిరస్మరణీయమని అన్నారు. అనంతరం పోలీసులు అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.