పాకాల మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. 12వ పి.ఆర్.సి నియామకం, పెండింగ్ డిఏల అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మనేరి ప్రభు, ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి సుధాకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.