
పొగమంచు ఎఫెక్ట్.. శంషాబాద్-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
TG: పొగమంచు కారణంగా శంషాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలను రహదారి పక్కకు నిలిపివేశారు. పొగమంచుతో ఔటర్ రింగ్‌రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




