చంద్రగిరి నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రెండు జాతీయ రహదారులు, పలు విద్యాసంస్థలు ఈ స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసులు, ఫిర్యాదులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే తగిన సిబ్బంది లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యానికేతన్ సమీపంలోని అవుట్‌పోస్ట్‌లో కూడా పోలీసులు లేని పరిస్థితి నెలకొంది. ఉన్న అరకొర సిబ్బందితో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే అదనపు సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.