Jan 24, 2026, 15:01 IST/జగిత్యాల
జగిత్యాల
రాయికల్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Jan 24, 2026, 15:01 IST
రాయికల్ మండలంలోని పద్మశాలి సేవా సంఘంలో ఇందిర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా 42 సంఘాలకు సుమారు 11 లక్షల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను, 7 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకున్నారని, పేద మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.