
చిత్తూరులో దేశభక్తి చాటిన సాంస్కృతిక కార్యక్రమాలు
చిత్తూరు జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. దేశభక్తి, జానపదం, యోగా వంటి అంశాలపై పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. కేజీబీవీ గుడుపల్లె విద్యార్థులు ప్రథమ బహుమతి, విజయ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ, ప్రభుత్వ జూనియర్ కళాశాల పాలసముద్రం విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు అందించారు.
































