చిత్తూరు జిల్లాలో తలకోన జలపాతం ఎంతో ప్రాచుర్యం పొందినది. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని అందించే మరో జలపాతం రామకుప్పం మండలంలోని చెలిమిచెన్లు తండా సమీపంలో ఉంది. వర్షాకాలంలో అక్కడి ఎత్తైన పర్వతాల నుంచి జలప్రవాహం జాలువారుతూ తలకోనను తలపిస్తుంది. ఈ చోటు ప్రకృతి ప్రేమికులకు శాంతి, ఆహ్లాదాన్ని ఇస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.