చిత్తూరు DMHO సుధారాణి, గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లకు కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం వారం రోజుల్లోగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్తింపు లేని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు DMHO వద్ద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.