చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వేట కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఘటన స్థలంలోనే ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, విలేకరుల సంఘాలు నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.