చిత్తూరు జిల్లా కరణం సేవా సంఘం అధ్యక్షులు నిరంజన్ బాబు ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్లో 22 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. వారికి రూ. 3116, రూ. 2116, రూ. 1116 చొప్పున నగదు బహుమతులు, శాలువాలతో సన్మానించారు. రాబోయే సంవత్సరం నుంచి పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.