బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం జాబితాను సమర్పించాలని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఓటర్ల జాబితా సవరణ పై సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ ఇతర క్లెయిమ్ లకు సంబంధించి సకాలంలో స్పందించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.