చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో, మంగళవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మామిడి పల్ప్ పరిశ్రమల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియ మరియు పరిశ్రమల నిర్వహణపై సమీక్షించారు. పరిశ్రమల యజమానులకు కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు.