చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా జనగణన కార్యక్రమం

974చూసినవారు
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా జనగణన కార్యక్రమం
చిత్తూరు జిల్లాలో మే 1వ తేదీ, శుక్రవారం నుంచి జనగణన ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, వేసవి దృష్ట్యా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ కార్యక్రమం కోసం 3,036 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించి, 2,885 మంది ఎన్యుమరేటర్లు, 493 మంది సూపర్వైజర్లను నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్