చిత్తూరు: నడివీధి గంగమ్మ జాతర ఎప్పుడో తెలుసా...

3చూసినవారు
చిత్తూరు నడివీధిలో గంగమ్మ జాతర చాటింపుతో ప్రారంభమైంది. మంగళవారం రాత్రి చామంతిపురంలోని గ్రామదేవత ఎల్లమ్మకు వంశపారంపర్య ధర్మకర్త సీకే లావణ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరిగె పూజలు చేసి గంగమ్మ శిరస్సును మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, ఊరి పొలిమేరల వరకూ చాటింపు వేశారు. శుక్రవారం నుంచి పొంగళ్ల నైవేద్యాలు ప్రారంభించాలని దండోరా వేశారు. ఈ నెల 12, 13 తేదీలలో పట్టణంలో గంగ జాతర నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్