చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఐడిఆర్ఎఫ్ ఫండ్ పంపిణీ

పుంగనూరు నియోజకవర్గం సదుం పోలీస్ స్టేషన్లో అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు కుటుంబానికి రూ. 1,00,000, సోమల పోలీస్ స్టేషన్లో ఇంటికి వెళుతుండగా బైక్ ప్రమాదంలో మరణించిన రమేష్ కుటుంబానికి రూ. 30,000 ఆర్థిక సాయాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు తమ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్. రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
