చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యపై సీనియర్ జర్నలిస్ట్, ఏపీ చైతన్య వేదిక కన్వీనర్ డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, రౌడీ షీటర్లు పట్టపగలే హత్యలకు తెగబడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే సంఘటన అని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఏపీ చైతన్య వేదిక పోరాటం ఆగదని ఆయన తెలిపారు.