చిత్తూరు జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. మాతా, శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మెరుగైన వైద్య సేవలు అందించడంపై అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.