చిత్తూరు ఎమ్మెల్యే గురజాల
జగన్ మోహన్ సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 2వ వార్డు మురకంబట్టులో
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను సొమ్ములను అందించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.