చిత్తూరు: పలు ప్రాంతాలలో జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

0చూసినవారు
చిత్తూరు: పలు ప్రాంతాలలో జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గంగమ్మ జాతర కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. 49వ వార్డు ఇందిరమ్మ కాలనీలో గంగమ్మకు తొలి హారతి ఇచ్చి పూజలు చేసిన ఆయన, దిగువ మాసాపల్లి పంచాయతీ శెట్టిగారి పల్లి కాలనీలో గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనాన్ని తొలి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, సత్కరించారు.

సంబంధిత పోస్ట్