తమిళనాడులోని షోలింగర్ పట్టణంలో ఉన్న శ్రీ యోగ నరసింహస్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఇతర
టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఆలయ పండితులు లోకేష్ కు తీర్థ ప్రసాదాలను అందజేశారు.