చిత్తూరు: పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

890చూసినవారు
చిత్తూరు: పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు, సోమవారం చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు ఒకటి మరియు రెండు టౌన్ పరిధిలోని దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి సారించి, రూ. 5,22,339 విలువైన 57 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసి, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకం, నిల్వ చట్టవిరుద్ధమని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్