చిత్తూరు: రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

8చూసినవారు
చిత్తూరు: రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు తమ కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు. జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్