చిత్తూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు: అధికారులు

1180చూసినవారు
చిత్తూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు: అధికారులు
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఆదివారం రాత్రి చిత్తూరు పట్టణంలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, తగినంత ఇంధనం అందుబాటులో ఉందని ధృవీకరించారు. బ్లాక్ మార్కెటింగ్ లేదా తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఏవైనా ఇబ్బందులు వస్తే 112కు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్