గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో, స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనకు కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాస్థాయిలో ఆర్థిక వృద్ధిరేటును పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.