శుక్రవారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లా జీడీనెల్లూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలోనూ వర్షం దంచికొట్టింది. ఇటీవల 40 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అకాల వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, మామిడి రైతులు మాత్రం ఈ వర్షంతో భయాందోళన చెందుతున్నారు.