వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా చిత్తూరు పట్టణంలో జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.