శనివారం ఉదయం తిరుమలకు గ్రామస్థులతో కలిసి ట్రాక్టర్లో బయలుదేరిన పులిచెర్ల మండలం పాతపేటకు చెందిన చలపతి(36) మతుకువారిపల్లిలో కాపురం ఉంటున్నాడు. కల్లూరులో ట్రాక్టర్ కింద ప్రమాదవశాత్తు పడటంతో అతన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చలపతి మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కల్లూరు ఎన్హెచ్ఐ ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.