చిత్తూరులో గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

9చూసినవారు
చిత్తూరులో గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరులో ఒడిశాకు చెందిన ఇద్దరు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏఆర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిగాయి. వారి వద్ద నుంచి 39.7 కేజీల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :