గురువారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
ఎన్టీఆర్ 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో తొమ్మిది నెలల కాలంలో అత్యంత మెజారిటీతో గెలిచిన ఘనత దివంగత నేత
ఎన్టీఆర్ కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చూడ చెర్ పర్సన్ కటారి హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, సీనియర్ నాయకులు గిర్వాణి చంద్ర ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.